26 August, 2026 | 10:37 PM

15 వరకు ఢిల్లీలోనే గవర్నర్!

13-11-2024 01:51 AM

పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న జిష్ణుదేవ్ వర్మ

హైదరాబాద్, నవంబర్ 12 (విజయక్రాంతి): రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈనెల 15 వరకు ఢిల్లీలోనే ఉండనున్నారు. ఆ రోజు సాయంత్రం 3.15 గంటలకు తిరిగి హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. మంగళవారం ఉదయం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన గవర్నర్ ఢిల్లీ, హర్యానా తదితర ప్రాంతాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నా రు.

బుధవారం ఉదయం 11 గంటలకు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగే ఆయుష్కాన్ కాన్ఫరెన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. సాయంత్రం 3.45 గంటలకు హర్యానాలోని మోతీలాల్ నెహ్రూ స్పోర్ట్స్ స్కూల్‌ను సందర్శిస్తా రు. గురువారం ఎలాంటి కార్యక్రమాలు లేవు. 15న ఉదయం న్యూఢిల్లీ ఇండియాగేట్ వద్ద ఉన్న నేషనల్ వార్ మెమోరియల్ వద్ద శ్రద్ధాంజలి ఘటిస్తారు. మధ్యాహ్నం బయలుదేరి సాయంత్రానికి హైదరాబాద్‌కు చేరుకుంటారు.