"ప్యాకేజ్డ్ ప్లాస్టిక్" భూతం.. పిల్లలకు ఆటిజం శాపం..
నేచర్: కొంత మంది గర్భిణీ స్త్రీల ప్లెసెంటా (బొడ్డు తాడు కణజాలం) లోనూ ప్లాస్టిక్ ఆనవాళ్లను కనుగొన్నామని పరిశోధకులు చెబుతున్నారు. ప్లాస్టిక్ లో ఉండే హానికారక బీపీఏ రసాయనాన్ని గర్భిణీ స్త్రీలలో గుర్తించినట్లు నేచర్ కమ్యూనికేషన్ లో ప్రచురితమైన తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. పిల్లల మెదడు పెరుగుదలలో ( మగ శిశువులలో ) కీలక పాత్ర పోషించే హార్మోనుని ఈ బీపీఏ అస్తవ్యస్తం చేస్తుందని నిర్ధారించారు. పిల్లలకు రెండేళ్లు వచ్చే అవకాశం మూడున్నర రేట్లు 11 ఏళ్ల కు ఆ ముప్పు ఆరు రేట్లు పెరుగుతుందట. సూపర్ మార్కెట్లలో ఆహార పానీయాల విక్రయాలలో భాగంగా విచక్షణా రహితంగా.. "ప్యాకేజ్డ్ ప్లాస్టిక్" వాడకమే ఈ పరిస్థితికి కారణమన్నారు. "ప్యాకేజ్డ్ ప్లాస్టిక్"తో సహా కవర్లను, బాటిల్లను, ఇళ్లను పునర్నిర్మంచేపుడు వచ్చే వాసనలు పీల్చడం కాస్మెటిక్స్ వల్ల కూడా బీపీఏ శరీరంలోకి వెళుతుందని చెబుతున్నారు.






