24 March, 2026 | 8:33 PM

Breaking News

ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల క్షేత్ర పర్యటన   •   జన గణనను పకడ్బందీగా పూర్తి చేయాలి   •   ప్రభుత్వానికి నాణ్యమైన సమాచారం అందించేలా కృషి చేయాలి   •   ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక సదుపాయాల కల్పనకు సత్వర చర్యలు   •   సంత నిర్వాహణ వేలంలో పెరిగిన ఆదాయం 5.02 శాతం మాత్రమే   •   జిల్లాను క్షయ వ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం   •   ద్వారకుంటలో సిసి రోడ్డు శంకుస్థాపన: సర్పంచ్ పాలకి సురేష్   •   ఖైదీలకు బెయిల్ విషయంలో సహాయం చేయడమే సాధికార కమిటీ ఉద్దేశ్యం   •   కోనరావుపేట 10వ వార్డ్‌లో పారిశుధ్య సమస్యలు   •   కోదండరామాలయం పరిసరాల్లో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు   •  

బీసీ రిజర్వేషన్ చట్టాన్ని గవర్నర్ ఆమోదించాలి

08-10-2025 12:04 AM

బీసీ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి కృష్ణ

మునుగోడు,  అక్టోబర్ 7 (విజయక్రాంతి): బీసీ రిజర్వేషన్ చట్టాన్ని గవర్నర్ ఆమోదించాలని బీసీ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి కృష్ణ అన్నారు. మంగళవారం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజులశ్రీనివాస్ గౌడ్ పిలుపుమేరకు అంబేద్కర్ చౌరస్తాలో నిరసన వ్యక్తం చేసి మాట్లాడారు. మాధవరెడ్డి బీసీల పట్ల మీ కుట్ర ను  మానుకోవాలని వారు హెచ్చరించారు.

రిజర్వేషన్ వ్యతిరేకులు రెడ్డి జాగృతి నాయకులు కోర్టులో రిజర్వేషన్ కోర్టుకు అడ్డుకునే ప్రయత్నాలు చేయడాన్ని తీవ్రంగా మండిపడ్డారు. హైకోర్టులో సుప్రీంకోర్టులో న్యాయమైన బీసీ రిజర్వేషన్ వాటాన్ని అడ్డుకోవాలని రిజర్వేషన్ వ్యతిరేకులు రెడ్డి జాగృతి నాయకులు చూడడం చాలా సిగ్గుమాలిన విషయం అని అన్నారు. 60% ఉన్నటువంటి బీసీలు స్థానిక ఎన్నికలు సర్పంచులు,ఎంపిటిసిలు,కౌన్సిలర్ కావడం ఇష్టం లేక పిడికెడు శాతం ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గాన్ని చెందినటువంటి మాధవరెడ్డి,గోపాల్ రెడ్డి బీసీల నోటి ముద్దను గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.

అసెంబ్లీలో చట్టం చేసిన బీసీ బిల్లును గవర్నర్ ఆమోదించకుండా కాలయాపన చేయడం చాలా విడ్డూరం అని అన్నారు.ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు గుంటూరు వెంకటాచారి,మాజీ ఉపసర్పంచ్ కొండ వెంకన్న, కొండా మల్లేష్, బక్క కృష్ణయ్య ,పంతంగి వెంకన్న, తన్నీరు నందివర్ధన్, బైరవని ,భానుప్రసాద్ ,కొమురవెల్లి నాయి ఉన్నారు.