08-10-2025 12:05:01 AM
ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి
ఎల్బీనగర్, అక్టోబర్ 7 : బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ లోని టీచర్స్ కాలనీకి చెందిన యువకుడు పోలే చంద్రశేఖర్ అమెరికా లోని డల్లాస్ నగరంలో గుర్తు తెలియని దుండగుల కాల్పుల్లో మృతి చెందడం ఎంతో బాధాకరమని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి అన్నారు. చంద్రశేఖర్ కుటుంబ సభ్యులను మంగళవారం పరామర్శించి, చంద్రశేఖర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
కష్టసమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆధౄ అన్నివిధాల సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో లింగోజిగూడ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ పన్యాల జయపాల్ రెడ్డి, కాంగ్రెస్ హస్తినాపురం డివిజన్ అధ్యక్షుడు శశిధర్ రెడ్డి, వినయ్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.