2 March, 2026 | 5:35 AM

పీఎస్‌ఆర్‌ను ఆహ్వానించిన గౌడ సంఘం సభ్యులు

02-03-2026 02:09 AM

ధర్మపురి, మార్చి1 (విజయక్రాంతి):వెల్గటూర్ మండల కేంద్రంలో మార్చి 5వతేదీ నుండి 10వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరగనున్న శ్రీరేణుక ఎల్లమ్మతల్లి బోనాలకు వెల్గటూర్ మండల మాజీ ఎంపీపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పొనుగోటి శ్రీనివాసరావును గౌడ సంఘం అధ్యక్షులు గడ్డం సత్తయ్య ఆధ్వర్యంలో గౌడ సంఘం సభ్యులు హైదరాబాదులోని ఆయన నివాసంలో కలిసి ఆహ్వానించారు.

వీలు చూసుకుని తప్పకుండా బోనాలకు రావాలని గౌడ సంఘం సభ్యులు ఈ సందర్బంగా పీఎస్‌ఆర్ ను కోరారు. తప్పకుండ పట్నాలకు హాజరవుతాననీ,గౌడ సంఘం సభ్యులు ఆహ్వానించడానికి ఇంతదూరం వచ్చి తనపై వెలకట్టలేని అభిమానo చూపినందుకు ఎంతో సంతోషంగా ఉందనీ పీఎస్‌ఆర్ ఈ సందర్బంగా తమ అభిప్రాయం వ్యక్తపరిచారు.ఈ కార్యక్రమంలో వెల్గటూర్ మాజీ సర్పంచ్ మేరుగు మురళి గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మేరుగు నరేష్ గౌడ్,గౌడ సంఘం సభ్యులు గుండ జగదీశ్ గౌడ్ ,మేరుగు అశోక్ గౌడ్, మొత్కూరి శేఖర్ గౌడ్,బందెల నర్సయ్య గౌడ్,రంగురాజయ్య గౌడ్,