13-11-2025 12:00:00 AM
మొయినాబాద్, నవంబర్ 12 (విజయ క్రాంతి) ఇటివల చేవెళ్ల మీర్జాదిగూడ ఆర్టీసీ ప్రమాద ఘటనలో ముగ్గురు బిడ్డలను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న పేర్కొంపల్లి ఎల్లయ్య గౌడ్ బాధిత కుటుంబ సభ్యులను బుధవారం గౌడ సంఘం నేతలు కలిసి పరామర్శించారు అదర్య పడుద్దని తామంతా అండగా ఉంటామని గౌడ హక్కుల పరిరక్షణ సమితి రాష్ర్ట అధ్యక్షులు రేనట్ల మల్లేష్ గౌడ్ జిల్లా అధ్యక్షుడు నరసింహగౌడ్, బసవపురం అంజయ్య గౌడ్ లు భరోసా కల్పించారు.
బాధిత కుటుంబ సభ్యుల కు అండ గా ఉండేందుకు మొయినాబాద్ మండలంలోని చిలుకూరు , ఎంకేపల్లి , నక్కలపల్లి, చాకలి గూడెం, సురంగల్, హిమాయత్ నగర్,;;గౌడ సంఘం;;ఆధ్వర్యంలో వారి కుటుంబ సభ్యులకు రూ.43,000 వేల రూపాయల ను సేకరించి కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందజేశారు. ఆర్థిక సాయం అందజేసిన వారిలో చిలుకూరు గ్రామానికి చెందిన గౌడ సంఘం అధ్యక్షుడు సుభాష్ గౌడ్ రూ. 15000, ఎనకపల్లి అధ్యక్షుడురూ. 10,000, నక్కలపల్లి, గౌడ సంఘం రూ. 5000, చాకలి గూడెం రేనట్ల దర్శన్ గౌడ్ గౌడ కుల హక్కుల పరిరక్షణ సమితి జాతీయ కార్యదర్శి రూ.10,000, సురంగల అశోక్ గౌడ్ రూ. 2000, హిమాయత్ నగర్ రాజు గౌడ్, వెయ్యి రూపాయలు అందజేశారు.