19 March, 2026 | 3:11 PM

టెన్త్ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించాలి

19-03-2026 12:00 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్,మార్చి 18(విజయ క్రాంతి): పదవ తరగతి వార్షిక పరీక్షలను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాం తంగా నిర్వహించాలని కలెక్టర్ హరిత అధికారులను ఆదేశించారు.బుధవారం జిల్లా కేంద్రంలోని జడ్పీ బాలికల సెకండరీ పాఠశాలలోని పరీక్ష కేంద్రాన్ని అకస్మికంగా తనిఖీ చేసి ఏర్పాట్లను పరిశీలించారు.

పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమె రాలు, తాగునీరు, వెలుతురు వంటి సౌ కర్యాలు కల్పించామని, వైద్య సిబ్బంది ద్వారా ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచామని చెప్పారు. ఫ్లయింగ్ స్క్వాడ్, సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు పర్యవేక్షణ చేస్తున్నాయని పేర్కొన్నారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు.