బాసర ట్రిబుల్ ఐటీ ఘటనపై తప్పుడు ప్రచారం
19-03-2026 12:00 AM
భైంసా, మార్చి 18 (విజయక్రాంతి) : బాసర త్రిబుల్ ఐటీలో విద్యార్థులను పోలీసులు దూషించారని సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో వినిపిస్తున్న వాయిస్ పూర్తిగా అబద్దం,ఆ వీడి యోలో ఉన్న వాయిస్ మార్ఫింగ్ చేసి, తప్పుదారి పట్టించేలా కావాలని రూ పొందించబడింది. కావున విద్యార్థులు, ప్రజలు ఇలాంటి తప్పుడు ప్రచా రాల ను నమ్మవద్దని విజ్ఞప్తి చేస్తున్నాము.




