6 May, 2026 | 5:35 PM

Breaking News

సామల వారి వివాహ వేడుకకు కాంగ్రెస్ అధ్యక్షుడు గుర్నూలే నారాయణ హాజరు   •   కోనరావుపేట పీఏసీఎస్ నూతన పాలకవర్గం బాధ్యతల స్వీకారం   •   గ్యాస్, పెట్రోల్ ధరలు తగ్గించాలి… సీపీఐ ధర్నా   •   పంట సాగుపై రైతులకు అవగాహన   •   కోనరావుపేటలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు –అన్నదాతల అవగాహన కార్యక్రమం   •   కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన నాగండ్ల దీపక్ చౌదరి   •   పిఏసిఎస్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన ఏగుల నరసింహులు,వైస్ చైర్మన్   •   కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు నీడ కల్పించాలని ఇందిరమ్మ పథకం   •   రైతుల సేవకు పున:రంకితమవుతా   •   రైస్ మిల్లుల్లో ధాన్యం వేగంగా అన్ లోడింగ్ చేయాలి   •  

రైస్ మిల్లుల్లో ధాన్యం వేగంగా అన్ లోడింగ్ చేయాలి

06-05-2026 05:02 PM

- ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

రుద్రంగి,(విజయక్రాంతి): ధాన్యం కొనుగోలు కేంద్రాలకు లారీల సంఖ్యను పెంచాలని, హమాలీల సంఖ్య పెంచి ఎప్పటికప్పుడు లోడ్ అయిన లారీలను వెంటనే అన్లోడ్ చేయాలని అధికారులను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆదేశించారు. ఆయన బుధవారం చందుర్తి మరియు రుద్రంగి మండలాల రైస్ మిల్లులను పరిశీలించారు. రైస్ మిల్లర్లు ఇప్పటి వరకు ఎంత ధాన్యం కొనుగోలు చేశారు. తదితర విషయాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకానికి అనుగుణంగా లారీలు సమకూర్చాలని,పౌర సరఫరాల శాఖ అధికారులు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరించిన రైతుల ఖాతాల్లో డబ్బులు వేగంగా జమ అయ్యేలా చూడాలని ఆదేశించారు.లారీల ట్రాన్స్పోర్ట్ లు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యానికి అనుగుణంగా వాహనాలను సమకూర్చాలని ధాన్యం తరలింపులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని ఆదేశించారు.ఆయన వెంట రుద్రంగి మార్కెట్ కమిటీ చైర్మన్ చేలుకల తిరుపతి, అధికారులు, నాయకులు తదితరులు ఉన్నారు.