12 May, 2026 | 11:47 PM

Breaking News

భధ్రాచలంలో ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు   •   హనుమాన్ సేన ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు   •   వృద్ధురాలి ఇళ్ళు కబ్జాకు యత్నం... న్యాయం చేయాలని వేడుకోలు   •   టి దుకాణాలలో స్మోకింగ్ జోన్లను ఎత్తివేయండి   •   గంజాయి కేసులో నలుగురిపై కేసు.. డి-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు   •   మంత్రి తుమ్మల పేరున ప్రత్యేక ప్రార్థనలు జరిపిన దమ్మపేట ముస్లిం మైనారిటీ నాయకులు   •   వికె సీఎం ఫిట్ కమిటీ సమావేశం   •   సమ్మర్ క్యాంప్ ఆకస్మిక తనిఖీ   •   పదో తరగతి సప్లమెంటరీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభం   •   ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు నిర్మిస్తే సహించం   •  

ధాన్యం కొనుగోలు పారదర్శకంగా, వేగవంతంగా నిర్వహించాలి

28-04-2026 02:02 AM

పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష 

సుల్తానాబాద్, ఏప్రిల్ 27 (విజయ క్రాంతి): రైతుల నుండి ధాన్యం కొనుగోలు పారదర్శకంగా, వేగవంతంగా జరగాలని  పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అధికారులకు సూచించారు. సోమవారం  పెద్దపల్లి జిల్లా  సుల్తానాబాద్ మండలంలోని సుగ్లంపల్లి లో  వరి ధాన్యం కొనుగోలు కేంద్రంను జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష  సందర్శించి, ధాన్యం కొనుగోలు ప్రక్రియను సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ  రైతులు తీసుకువచ్చే ధాన్యం తప్పనిసరిగా ఎఫ్‌ఏక్యూ ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూడాలని తెలిపారు.

కేంద్రాల్లో తూకం, తేమ శాతం కొలతలు సక్రమంగా నిర్వహించాలని, ఎలాంటి ఆలస్యం లేకుండా రైతులకు రశీదులు ఇవ్వాలని ఆదేశించారు.అదేవిధంగా, ధాన్యం మిల్లులకు పంపించే ప్రక్రియలో జాగ్రత్తలు తీసుకోవాలని, ఓపీఎంఎస్ లో వివరాలు సకాలంలో నమోదు చేయాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సదుపాయాలు కల్పించాలని పిపిసి ఇంచార్జ్లకు తెలిపారు.ఈ సందర్శనలో డి. ఎం.శ్రీకాంత్,సంబంధిత అధికారులు, సిబ్బంది తదితరులు ,పాల్గొన్నారు.