ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలి
రాష్ట్ర సివిల్ సప్లైస్, ప్రధాన కార్యదర్శి, కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర
కామారెడ్డి,(విజయక్రాంతి): ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను రాష్ట్ర సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఆదేశించారు. సోమవారం కామారెడ్డి మండలం గరుగుల్లో వారి ధాన్యం కొనుగోలు సెంటర్ ను, గోకుల్ తండాలో ధాన్యం సెంటర్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడారు. వరి కొనుగోలు కేంద్రాల పనితీరును పరిశీలించారు. వారి కొనుగోలులో భాగంగా పనిచేస్తున్న అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
రైతులకు ఇబ్బందులు కలగకుండా ధాన్యాన్ని కొనుగోలు చేసి రైస్ మిల్లులకు పంపించాలని సూచించారు. కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. రైతులకు చెల్లింపులు త్వరగా జరిపేందుకు ఓ పి ఎం ఎస్ టాబ్లెట్లలో నమోదులను సమయానికి పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం జిల్లాలో 353 టన్నుల వారి ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనప కలెక్టర్ విక్టర్, జిల్లా సివిల్ సప్లై అధికారి, సివిల్ సప్లై డిఎం, డిఆర్డిఏ పిడి సురేందర్, జిల్లా కో-ఆపరేటివ్ అధికారి, డిఎల్ఎంఓ, ఏడిమార్కెటింగ్, ఇతర సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.
ఐపీఎస్ కామారెడ్డి మండలం గర్గుల్ గ్రామంలోని ప్యాడీ ప్రొక్యూర్‌మెంట్ సెంటర్ (PACS), గోకుల్ తాండా పీపీసీ (IKP)లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడి, ప్యాడీ కొనుగోలు కేంద్రాల పనితీరును పరిశీలించారు. ప్యాడీ కొనుగోలులో భాగంగా పని చేస్తున్న అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని, అలాగే రైతులకు చెల్లింపులు త్వరగా జరగేందుకు OPMS టాబ్లెట్లలో నమోదులను సమయానికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం జిల్లాలో మొత్తం 35,300 మెట్రిక్ టన్నుల ప్యాడీ కొనుగోలు జరిగిం దన్నారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్, జిల్లా సివిల్ సప్లైస్ అధికారి (DCSO), డీఎం (సివిల్ సప్లైస్), DRDO, DCO, DLMO, AD (మార్కెటింగ్) మరియు ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.






