30 June, 2026 | 11:25 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి

29-05-2025 12:13 AM

- కలెక్టర్ అభిలాష అభినవ్

నిర్మల్ మే 28(విజయ క్రాంతి): రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా సాగాల నికలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. బుధవారం సారంగాపూర్, జామ్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

సారంగాపూర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో పి. ఎస్.సి.ఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్, ధాన్యం తూకం, లోడింగ్ ప్రక్రియను స్వ యంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మిగిలి ఉన్న వరి ధాన్యా న్ని వెంటనే కొనుగోలు చేసి మిల్లుల కు తరలించాలని అధికారులను ఆదేశించారు.

ప్రస్తుతం ఉన్న హమాలీలతో పాటు ప్రతి కేంద్రంలో మరో 20 మంది అదనపు కూలీలను సమకూర్చి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుం డా చూస్తామన్నారు. తడిసిన ధాన్యాన్ని కూడా చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు.

ధాన్యం కొనుగో లు పై ఎటువంటి అపోహలకు లోనుకావద్దని, రైతులందరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామన్నారు. అనంతరం జామ్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్, ధాన్యపు తేమ శాతం, తూకం ప్రక్రియలను పరిశీలించారు. మిల్లర్లు ధాన్యంలో కోత విధిస్తున్నారని రైతుల నుంచి ఫిర్యాదు రావ డంతో, కలెక్టర్ మిల్లర్లతో మాట్లాడి అటువం టి చర్యలు తగవని స్పష్టంచేశారు.

ధాన్యంలో ఎటువంటి కోతలూ లేకుండా, తూకం వేసి, తక్షణమే మిల్లులకు తరలించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ తనిఖీల్లో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, జిల్లా పౌరసరఫరాల అధికారి కిరణ్ కుమా ర్, జిల్లా మేనేజర్ సుధాకర్, తహసిల్దార్ శ్రీదేవి, అధికారులు పాల్గొన్నారు.