30 June, 2026 | 10:35 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

చాకలి కులస్థులను ఎస్సీ జాబితాలో చేర్చాలి

29-05-2025 12:16 AM

- చాకలి ఎస్సీ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీలక్ష్మి

ముషీరాబాద్, మే 28 (విజయక్రాంతి):  చాకలి కులస్తులను ఎస్సీ జాబితాలో చేర్చాలని చాకలి ఎస్సీ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షురాలు చాకలి శ్రీలక్ష్మి  డిమాండ్ చేశారు.

ఈ మేరకు బుధవారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన  కేంద్రంలో చాకలి ఎస్సీ సాధన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ సిహెచ్. రాజయ్య అధ్యక్షతన 8వ వార్షికోత్సవ మహాసభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా హాజరైన మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బసవ రాజు సారయ్య, ప్రొఫెసర్ అక్కినపల్లి పున్నయ్య, రచయిత, ప్రముఖ జర్నలిస్టు నీల వెంకన్న హాజరైయ్యారు.

ఈ సందర్భంగా అక్కినపల్లి పున్నయ్య, శ్రీలక్ష్మి మాట్లాడుతూ చాకలి కులాన్ని బీసీ జాబితాల నుంచి ఎస్సీ జాబితాలోకి మార్చాలని కదలిరండి అని  పిలు పునిచ్చారు. ఎస్సీ జాబితాలో చేర్చుటకు తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మా నం చేసి పార్లమెంట్‌కు పంపాలన్నారు. వాషర్ మెన్ ఫెడరేషన్ పునరుద్ధరించి పాలకవర్గాన్ని నియమించాలన్నారు.

చాకలి బందు పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతి కుటుంబానికి రూ.10 లక్షలు ఇవ్వాలన్నారు. హైదరాబాద్ నగరంలో ఐదేకరాల స్థలం కేటాయించి చాకలి ఐలమ్మ భవన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమా వేశంలో రాష్ట్ర ప్రచార కార్యదర్శి రాయ ల శ్రీను, రాష్ట్ర ఉపాధ్యక్షులు షర్టు వెంకటేశ్వర్లు, సాయి,  నగనూరి ఎల్లయ్య, నాగేష్ తదితరులు పాల్గొన్నారు.