23 June, 2026 | 5:23 PM

Breaking News

రోడ్డు ప్రమాదంలో డాన్స్ మాస్టర్ మృతి   •   రెవిన్యూ రికార్డులను పరిశీలించిన కలెక్టర్   •   బిగ్ డేటా యుగంలో ఈ-కామర్స్ భద్రతపై పరిశోధనకు పీహెచ్‌డీ   •   మాదిగల్లో అక్షరాస్యత పెంపుకు 40 రోజుల "గో టు విలేజ్" కార్యక్రమం   •   నెల్లిపాక భూములపై ప్రొహిబిషన్ ఎత్తివేయాలి   •   విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉంటేనే బంగారు భవిష్యత్   •   ఐఎస్‌ సదన్‌లో భారీ చోరీ.. రూ.17 లక్షలతో పరారైన ఏటీఎం క్యాష్ వ్యాన్ డ్రైవర్   •   రైతులకు అందుబాటులో విత్తన మేళ   •   తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా మట్టి పెల్లి సైదులు ఎన్నిక   •   ఎస్ఆర్ఆర్ లో బీకాం విద్యార్థులకు ఏఐ, డిజిటల్ లెర్నింగ్ పై శిక్షణ   •  

ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించాలి

18-04-2025 12:42 AM

చేర్యాల,ఏప్రిల్ 17 చేర్యాల వ్యవసాయ మార్కెట్లో ధాన్యం కొనుగోళ్ల ప్రారంభించాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కొంగర వెంకట్ మావో అన్నారు. పట్టణం లో గల వ్యవసాయ మార్కెట్  ను స్థానిక సిపిఎం నా యకులతో కలిసి సందర్శించి, రైతులతో మా ట్లాడారు. అనంతరం మాట్లాడుతూ రైతులు పండించిన పంటను మార్కెట్కు తెచ్చి, ఆరబోసి అమ్ముకోవడం కోసం ఎదురు చూ స్తున్నారన్నారు.

ధాన్యంతో మార్కెట్ అంతా నిండిపోయింది అన్నారు. స్పందించి వెంట నే ధాన్యం  కొనుగోలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. వచ్చిన ధాన్యాన్ని వచ్చినట్లు కొనుగోలు చేస్తే, కొత్త రైతులకు అవకా శం లభిస్తుందన్నారు. వాతావరణం లో మార్పులు వస్తున్నాయని, అకాల వర్షాలు కురిస్తే, ఆరుగాలం శ్రమించి పండించిన పంట తడిసిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎలాంటి కోతలు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్  చేశారు.