calender_icon.png 2 November, 2025 | 6:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాల్వంచ సొసైటీ ద్వారా 5 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు

30-10-2025 01:11:00 AM

సొసైటీ అధ్యక్షులు కొత్వాల శ్రీనివాసరావు 

భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 29, (విజయక్రాంతి):భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కో-ఆపరేటివ్ సొసైటీ ద్వారా మం డలం పరిధిలో 5 ధాన్యం కొనుగోలు కేం ద్రాలు ఏర్పాటు చేసి,ప్రభుత్వ మద్దతు ధర కు రైతుల వద్ద నుండి ధాన్యం కొనుగోలు చేయనున్నట్లు పాల్వంచ సొసైటీ అధ్యక్షులు డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు తెలిపారు. పాల్వంచ సహకార సం ఘం కార్యాలయంలో బుధవారం కొనుగోలు కేంద్రాల నిర్వహకులు,వ్యవసాయ శా ఖ అధికారుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల పరిధిలోని రెడ్డిగూడెం(ప్రభాత్ నగర్), కారేగట్టు, సోములగూడెం, నాగారం, మున్సిపాలిటీ పరిధిలోని పేటచెరువు ప్రాంతాల్లో ధా న్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నామన్నారు. ఈ సంవత్సరం వరి ధా న్యం సాధారణ రకం రూ. 2,369, ఏ గ్రేడ్ రకం రూ 2,389 లుగా ప్రభుత్వ మద్దతు ధర ప్రకటించిందన్నారు. సన్నరకం దాన్యానికి క్వింటాలకు రూ 500 బోనస్ ఇవ్వనున్నామని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

 పాల్వంచ సొసైటీ కార్యదర్శి బదిలీ 

పాల్వంచ సొసైటీలో కార్యదర్శిగా(సీఈవో) గా పనిచేస్తున్న జి లక్ష్మీనారాయణ (శ్రీను) బూర్గంపాడు సొసైటీ కి బదిలీ అయ్యారు. పాల్వంచ నూతన కార్యదర్శిగా బత్తిన వెంకటప్రసాద్ బుధవారం బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా కొ త్వాల తో పాటు పాలకవర్గం సభ్యులు సిబ్బంది లక్ష్మీనారాయణ ను శాలువా బోకేలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ కాంపెల్లి కనకేష్, డైరెక్టర్లు బుడగం రామమోహనరావు, కనగాల నారాయణరావు, చౌగాని పాపారావు, సామా జనార్ధన రెడ్డి, జరభన సీతారాం బాబు, భూక్య కిషన్, ఎర్రంశెట్టి మధుసూదన్ రావు, కార్యదర్శులు బివి ప్రసాద్,జి లక్ష్మీనారాయణ,ఏ ఈ ఓ అణురిక, కొనుగోలు కేంద్రా ల నిర్వహకులు, వ్యవసాయ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.