30-10-2025 01:09:42 AM
ఏరియా జీఎం రాధాకృష్ణ
మందమర్రి, అక్టోబర్ 29 : సింగరేణి సం స్థ అభివృద్ధిలో, నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాల సాధనలో కార్మిక సంఘాల పాత్ర కీలకమని ఏరియా జనరల్ మేనేజర్ ఎన్ రాధాకృష్ణ అన్నారు. ఏరియా జీఏం కార్యాలయంలో బుధవారం నిర్వహించిన 11వ స్ట్రక్చర్ మీటింగ్ లో ఆయన మాట్లాడారు. సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకతలోనే కాకుండా ఉద్యోగుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతను ఇస్తుందన్నారు.
ఈ సం దర్భంగా గుర్తింపు కార్మిక సంఘం నాయకు లు, కార్మికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురాగా సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఎస్‌ఓటు జిఎం విజయ ప్రసాద్, పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యాంసుందర్, కేకే గ్రూప్ ఏజెంట్ రాంబాబు, ఎస్కె గ్రూప్ ఏజెంట్ ఖాదీర్, కేకే ఓసి ప్రాజెక్ట్ ఆఫీసర్ మల్లయ్య,
ఐఈడి ఎస్‌ఈ కిరణ్ కుమార్, ఏరియా స్టోర్స్ డీజీఎం (ఈ అండ్ ఎం) సురేష్, సివిల్ ఎస్‌ఇ రాము, రామకృష్ణాపూర్ ఏరియా హాస్పిటల్ డివైసీఎంవో ఎం మధు కుమార్, డివైపిఎం సందీప్, ఏఐటియుసి బ్రాంచ్ సెక్రటరీ సలేంద్ర సత్యనారా యణ, నాయకులు అక్బర్ అలీ, దాగం మల్లే ష్, కంది శ్రీనివాస్, స్ట్రక్చర్ కమిటీ సభ్యులు సివి రమణ, సీనియర్ అధికారులు, యూనియన్ నాయకులు పాల్గొన్నారు.