పకడ్బందీగా ధాన్యం కొనుగోలు
కలెక్టర్ అభిలాష అభినవ్
నిర్మల్, అక్టోబర్ 29 (విజయక్రాంతి): జిల్లా లో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను ఎటువంటి లోటుపాట్లు లేకుండా సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. బుధవారం లోకేశ్వ రం మండలంలోని హవర్గాలో పీఎసీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగో లు కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రంలో తూకపు య్ంర తాలు, తేమ యంత్రాలు, ప్యాడీ క్లీనర్స్, టార్పాలిన్లు సరిపడినన్ని అందుబాటులో ఉన్నాయా అని తనిఖీ చేశారు.
కేంద్రంలో నిర్వాహకుల వివరాలు, మద్దతు ధర, టోల్ ఫ్రీ నంబర్ వివరాలు స్పష్టంగా కనిపించేలా ఫ్లెక్సీలు తప్పనిస రిగా ఉంచాలని సూచించారు. టెంట్, త్రాగునీటి వంటి సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రైతులకు రసీదులు జారీ చేయడంతో పాటు, వారి బ్యాంకు వివరాలను సక్రమంగా నమోదు చేసి, పంట రుసుము సకాలంలో రైతుల ఖాతాల్లో జమ అయ్యేలా చూడాలని సూచించారు.
అన్ని రకాల రిజిస్టర్లు పకడ్బందీగా నిర్వహించాలని పేర్కొన్నారు. ప్రభుత్వం పంటకు మద్దతు ధరకోసం టోల్ ఫ్రీ నంబర్ 9182958858 ను సంప్రదించవచ్చని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, డి సి ఓ నర్సయ్య, జిల్లా పౌర సరఫరా అధికారి రాజేందర్, పౌర సరఫరాల మేనేజర్ సుధాకర్, తహసీల్దార్ భోజన్న, ఎం పి డి ఓ రామకృష్ణ, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.






