17 April, 2026 | 2:29 PM

Breaking News

తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •   శ్రీ భీమేశ్వర స్వామి సేవలో ఐజీపీ రమేష్ నాయుడు   •  

నిబంధనల మేరకు ధాన్యం సేకరించాలి

10-05-2025 12:00 AM

జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతీలాల్

మంచిర్యాల, మే 9 (విజయక్రాంతి) : జిల్లాలో రైతుల సౌకర్యార్థం ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో రైతుల వద్ద నుండి ప్రభుత్వ నిబంధనల మేర కు నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని పి పి సి ఇంచార్జీలను జిల్లా అదనపు కలెక్ట ర్ సబావత్ మోతిలాల్ ఆదేశించారు.

శుక్రవారం జిల్లాలోని కాసిపేట మండలం మల్క పల్లిలో ప్రాథమిక వ్యవసాయ సహకార సం ఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి ఎ. పురుషోత్తం, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ తిరుపతి, షెడ్యూల్ కులముల సహకార సంస్థ ఈ.డి. చాతరాజుల దుర్గాప్రసాద్, తహశిల్దార్ భోజన్నలతో కలిసి సంద ర్శించి వరిధాన్యం పరిశుభ్రత యంత్రం పనితీరును, రైతు కుప్పక పోసిన ధాన్యం తేమ శా తంను పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ రైతు సంక్షేమంలో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా నిబంధనల ప్రకారం రైతుల వద్ద నుండి నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు. సన్నరకం వడ్లకు మద్దతు ధరతో పాటు 500 రూపాయలు బో నస్‌గా చెల్లిస్తున్నామన్నారు.

ధాన్యం విక్రయించిన రైతులకు రశీదు జారీ చేయాలని, రైతులు, ధాన్యం వివరాలను ట్యాబ్ లలో నమోదు చేసి సంబంధిత రైతుల ఖాతాలలో నగదు జమ చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. రైతు ఆటోమెటిక్ యంత్రంతో శుభ్రం చేసి కొనుగో లు కేంద్రాల వద్దకు నిబంధనల ప్రకారం ధా న్యం తీసుకురావాలని, అందుబాటులో ఉన్న టార్పాలిన్లను వినియోగించుకోవాలన్నారు.