calender_icon.png 10 May, 2025 | 10:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అకాల వర్ష బాధితులకు అండగా డాక్టర్ వివేక్

09-05-2025 10:45:26 PM

పది కుటుంబాలకు లక్ష రూపాయల సహాయం

మహబూబాబాద్,(విజయ క్రాంతి): మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం గొల్ల చర్ల గ్రామ పరిధిలో గత వారం రోజుల క్రితం అకాల వర్షాలతో నష్టపోయిన కుటుంబాలకు డాక్టర్ వివేక్ పదివేల రూపాయల చొప్పున 10 కుటుంబాలకు రూ.లక్షల సహాయంగా అందజేశారు. బాధిత కుటుంబాలను పరామర్శించి వారి బాధలు అడిగి తెలుసుకున్నారు. ఇండ్ల కప్పులు పూర్తిగా దెబ్బతిని నిలువ నీడ లేక ఇబ్బందులు పడుతున్న పేదలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షాలకు నష్టపోయిన కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో  సీనియర్ జర్నలిస్టు డి.వై గిరి, డి ఎస్ ఎఫ్ ఐ నాయకులు శ్రీకాంత్, శాంతి కుమార్, సాయికుమార్, సూర్య ప్రకాష్, విష్ణు, శివ, వర్మ, నరేష్,  తరుణ్, వినయ్ పాల్గొన్నారు.