27 July, 2026 | 6:07 PM

Breaking News

ఐదెకరాల ప్రభుత్వ భూమి కబ్జా..   •   బీజిలిపూర్ ఎస్సీకాలనీ కరెంట్ సమస్య పరిష్కరించరా?   •   అర్హులందరికీ ఓటు హక్కు కల్పించాలి: ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   భాగీరథిపల్లిలో రూ.25 లక్షల కల్వర్టు నిర్మాణానికి భూమిపూజ   •   ఇల్లందు ఏరియాలో సింగరేణి ఉద్యోగులకు క్వార్టర్ల కౌన్సిలింగ్ నిర్వహణ   •   నేరేడుచర్లలో భాజపా ఆధ్వర్యంలో " సర్" ప్రక్రియపై సమీక్ష   •   రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి   •   ఎక్స్‌టార్షన్‌కు పాల్పడిన నిందితులు అరెస్ట్.. రిమాండ్   •   తొలిముద్ద కార్యక్రమాన్ని ప్రారంభించిన కార్పొరేటర్ కంచర్ల హిమశ్రీ   •   ప్రభుత్వ, ఆశ్రమ పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించాలి   •  

మెదక్‌ జిల్లాలో అగ్నిప్రమాదం.. ఆరబెట్టిన ధాన్యం దగ్ధం

02-06-2026 01:08 PM

వెల్దుర్తి : మెదక్ జిల్లా(Medak district) వెల్దుర్తి మండలం దామరంచలో అగ్నిప్రమాదం జరిగింది. మంటలు అంటుకుని రోడ్డు పక్కన ఆరబెట్టిన ధాన్యం దగ్ధమైంది. రైతు నాచారం మహేశ్ కు చెందిన 40 బస్తాల ధాన్యం కాలిపోయింది. గుర్తుతెలియని వ్యక్తులు దామరంచ శివారులో గడ్డికి నిప్పుపెట్టారు. గాలికి మంటలు వ్యాపించి వడ్లకుప్ప, ధాన్యం బస్తాలు దగ్ధం అయ్యాయి. ప్రభుత్వం తనను ఆదుకోవాలని రైతు మహేశ్ వేడుకుంటున్నాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.