27 July, 2026 | 6:40 PM

Breaking News

దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తి అరెస్ట్   •   పైతర పంచాయతీ కార్మికులకు ప్రమాద బీమా పత్రాల పంపిణీ   •   సర్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు   •   విద్యాబోధనలో నూతన విధానాలను అమలు చేయాలి   •   యూనియన్ బ్యాంకులో తెలుగు తెలిసిన సిబ్బందిని నియమించాలి   •   ఎల్ నినోను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి నిత్య కళ్యాణం   •   గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనాన్ని అమలు చేయాలి: జడ శ్రీనివాస్   •   డబుల్ బెడ్‌రూం ఇళ్ల సమస్యలపై కలెక్టర్‌కు సీపీఎం వినతి   •   ఎల్ నినో దృష్య వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి   •  

ఐదెకరాల ప్రభుత్వ భూమి కబ్జా..

27-07-2026 06:06 PM

- వార్డు కౌన్సిలర్ ప్రజావాణిలో ఫిర్యాదు..

బెల్లంపల్లి,(విజయ క్రాంతి): బెల్లంపల్లి మునిపాలిటి 3వార్డు లో సర్వే నంబర్ 170/పిపి 5 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా పై వెంటనే చర్యలు తీసుకోవాలని వార్డు కౌన్సిలర్ బేడ్డాల సౌజన్యవిజయ్ కుమార్ సబ్ కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. సోమవారం ప్రజావాణిలో అధికారులకు భూకబ్జా పై లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. 3వ వార్డు పరిధిలోని సర్వే నంబర్ 170/పిపి 5 ఎకరాల ప్రభుత్వ భూమిని కొంతమంది బడానేతలు కబ్జా చేసి, ప్లాట్లుగా వాటాలు వేసి అమ్ముతున్నారని కౌన్సిలర్ బెడ్డల ఆమె ఆరోపించారు. కబ్జాదారులు ఆ భూమిలో ఇప్పటికే  సరిహద్దులు కూడా ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు. దీనివల్ల ప్రభుత్వానికి, వార్డు అభివృద్ధికి తీవ్ర నష్టం కలుగుతుందని వాపోయారు. సర్వే నంబర్ 170/పిపి ప్రభుత్వ భూమిని వెంటనే సరిహద్దులతో సహా తొలగించి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల కోరారు. ఈ భూ కబ్జాకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆస్తిని కాపాడే వరకు తన పోరాటం ఆగదని కౌన్సిలర్ స్పష్టం చేశారు.