కామారెడ్డి జిల్లాలో గ్రామ పంచాయతీ కార్యదర్శి హత్య
హైదరాబాద్: కామారెడ్డి జిల్లాలో(Kamareddy district) దారుణం చోటుచేసుకుంది. గ్రామ పంచాయతీ కార్యదర్శి(Gram Panchayat Secretary) హత్యకు గురయ్యాడు. పిట్లం మండలం చిన్నకొడపగల్ పంచాయతీ కార్యదర్శి కృష్ణ హత్య చేశారు. పంచాయతీ కార్యదర్శి కృష్ణను చంపిన దుండగులు చెరువులో పడేశారు. శనివారం ఉదయం చెరువులో పంచాయతీ కార్యదర్శి కృష్ణ మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. కృష్ణ గత రెండు రోజులుగా కనిపించకుండా పోయాడని కుటుంబీకులు తెలిపారు. అక్రమ సంబంధం నేపథ్యంలోనే హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. కృష్ణను ఎవరు హత్య చేశారు.? ఎందుకు హత్య చేశారు.. పాత గొడవలు ఏమైనా ఉన్నాయా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.






