17 April, 2026 | 2:38 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

మొండికుంట శ్మశానవాటికకు మరమ్మతులు చేపట్టిన గ్రామపంచాయతీ

03-03-2026 12:00 AM

అశ్వాపురం, మార్చి 2 (విజయ క్రాంతి): అశ్వాపురం మండలంలోని మొండికుంట గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న స్మశాన వాటికకు సోమవారం మరమ్మతులు చేపట్టారు. గత రెండు సంవత్సరాలుగా స్పెషల్ ఆఫీసర్ల పాలనలో అవసరమైన పనులు జరగకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో సమస్యలను గుర్తించిన గ్రామపంచాయతీ ఇటీవల చర్యలు ప్రారంభించింది.

వారం రోజుల క్రితమే నీటి పైప్లైన్ మరమ్మతులు పూర్తి చేయగా, ఈరోజు స్మశాన వాటికలో మట్టిని తొలగించి చుట్టుపక్కల ప్రదేశాన్ని చదును చేయించారు. ఈ పనులను సర్పంచ్ మర్రి సంధ్య, ఉపసర్పంచ్ చలమల్ల శివకుమార్, కార్యదర్శి సంధ్య ప్రత్యక్షంగా పర్యవేక్షించారు.