శ్రీ బాలాజీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవంలో పీవీఆర్‌యూత్
అన్నపురెడ్డిపల్లి, మార్చి 2 (విజయ క్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలో కొలువై ఉన్న శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా పర్స వెంకట్‌గారి ఆధ్వర్యం లో పివిఆర్ యూత్ సభ్యులు భక్తుల అలసటను దూరం చేసేందుకు మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా కాంగ్రె స్ నాయకులు పర్సా వెంకట్, ఈ వో వెంకటరమణ, మండల నాయకులు వేముల రమణ, మాజీ సర్పంచ్ బోడ పద్మ, శివాలయ వైస్ చైర్మన్ గుజ్జా, పూర్ణచంద్రరావు,మరకాల లక్ష్మారెడ్డి, బలసాని శ్రీను, వడ్డీ బోయిన చెన్నారావు, పోతుగంటి రాంబాబు, నకిరేకంటి వెంకటేశ్వరరావు, నరుకుల్లా కృష్ణయ్య, వీరబోయిన నాగేశ్వరరావు, చింతా నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు.




