10 June, 2026 | 6:20 PM

Breaking News

జూన్ 15న చలో కలెక్టరేట్‌ను విజయవంతం చేయండి   •   ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా అశ్వాపురంలో ప్రత్యేక గ్రామసభ   •   మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ ప్రజాస్వామ్యానికి విఘాతం   •   మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ ప్రజాస్వామ్యంపై దాడి   •   శాంతిఖని ప్రాజెక్టును సందర్శించిన ఆస్ట్రేలియా ప్రతినిధి బృందం   •   ప్రభుత్వ పాఠశాలలకు టెక్స్ట్ బుక్కులు, నోటుబుక్కులు సరఫరా   •   జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయండి   •   రైతులు మొబైల్ నెంబర్ యూరియా యాప్లో పొందుపరచుకోవాలి   •   పరిశుభ్రంగా ఉన్న గ్రామాలు ఆరోగ్యంగా ఉంటాయి: ఎమ్మెల్యే కోరం   •   బొల్లారంలో గ్రామసభ   •  

పరిశుభ్రంగా ఉన్న గ్రామాలు ఆరోగ్యంగా ఉంటాయి: ఎమ్మెల్యే కోరం

10-06-2026 05:46 PM

టేకులపల్లి,(విజయక్రాంతి): ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం టేకులపల్లి మండలం రామచంద్రుని పేట గ్రామ పంచాయతీలో గ్రామసభ నిర్వహించారు. ఎమ్మెల్యే కోరం కనకయ్య  ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. ఘన వ్యర్థాల నిర్వహణ అనేది పర్యావరణ పరిరక్షణ, ప్రజారోగ్యం, పరిశుభ్రత కోసం అత్యంత ముఖ్యమైన అంశమని, పరిశుభ్రమైన గ్రామాలు, పట్టణాలు, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలను ప్రతి పౌరుడు తప్పనిసరిగా పాటించాలన్నారు.

చెత్తను సక్రమంగా నిర్వహిద్దాం–పర్యావరణాన్ని పరిరక్షిద్దాం అనే భావనతో అందరూ ముందుకు రావాలన్నారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బోడు సబ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి  ప్రజలకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్నప్పటి నుంచే రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. రోడ్డు భద్రత అనేది కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడి బాధ్యత కూడా అన్నారు.

మనం నియమాలను పాటిస్తేనే ప్రమాదాలను తగ్గించగలం మరియు సురక్షిత సమాజాన్ని నిర్మించగలమణి అన్నారు. ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ శాఖల అధికారులు హాజరై వారి శాఖలపై పూర్తి వివరాలను ప్రజలకు ఈ వేదికగా తెలియచేసారు. ఇందిరమ్మ ప్రభుత్వంలో రైతులకి పెద్ద పీట వేస్తుందని, అనేక సంక్షేమ పథకాలను ప్రజల కోసం అమలు చేస్తూ, ముక్యంగా మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు.