28 August, 2026 | 9:52 AM

దమ్మపేటలో ఎస్‌ఐఆర్‌పై గ్రామసభ

28-08-2026 01:00 AM

దమ్మపేట,(విజయ క్రాంతి): ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై దమ్మపేట తహశీల్దార్, (డిప్యూటీ కలెక్టర్, అండర్ ట్రెయినీ) మద్దినేనిమురళి దమ్మపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో గురువారం గ్రామ సభ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామసభలు పెడుతున్న సందర్భంగా సర్పంచ్ పగడాల రమాదేవి రాంబాబు అధ్యక్షతన దమ్మపేట పంచాయతీ పరిధిలో గల బి.ఎల్.ఓ లు, ఆశాలు, వివిధ పార్టీలకు చెందిన నాయకులతో, గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా బి.ఎల్.ఓ ల సూపర్వైజర్ జి. పి. ఓ నరసింహారావు మాట్లాడుతూ ప్రతీ బి.ఎల్.ఓ తో గత రెండు నెలలుగా సర్ పక్రియ చేపట్టిన పనుల వివరాలను సమావేశంలో చదివి వినిపించారు. అందులో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా, తప్పుల సవరణ, అనర్హుల తొలగింపు, మరణించిన వారి పేర్లు, ఊరు మారిన వారి వివరాలు, డబల్ ఎంట్రీ ఒకరి కంటే ఎక్కువ ఓట్లు తదితర వివరాలను తెలిపారు. ఈ సందర్భంగా తహశీల్దార్  మురళీ మాట్లాడుతూ అక్టోబరు 1 వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండే యువతకు కొత్త ఓటు నమోదు కోసం ఫారం-6 ద్వారా అవకాశం ఉంది అన్నారు, సర్  పక్రియలో ఊర్లో ఉండి ఫారం ఇవ్వని వాళ్ళ ఓట్లు పోయి ఉంటే వారు ఓటు నమోదు చేసుకోవచ్చని తెలిపారు.   

తొలగించిన ఓట్లు వివరాలను పంచాయతీ కార్యాలయంలో అందుబాటులో ఉంచుతున్నాం అన్నారు. ఓటర్ల తొలగింపు తాలుఖా వివరాలను పార్టీల  వారీగా జిరాక్స్ కాపీలు ఇస్తామన్నారు. సర్పంచ్ రమాదేవి మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు కీలకమైనదని, అర్హుల అయిన వారి ఓట్లు పోకుండా చూడాల్సిన బాధ్యత బి.ఎల్.ఓ లు, ప్రజా ప్రతినిధులు, అధికారులది అయిన మన అందరి పై ఉందన్నారు. ప్రతీ ఒక్కరు బాధ్యత కల్గి ఉండాలని, ఇప్పటికీ ప్రజలు ఫారంలు తెచ్చి ఇస్తున్నారని,

పంచాయతీ పరిధిలో సుమారు 1500 ఓట్లు సర్ పక్రియలో భాగంగా తొలగించబడ్డాయని , ప్రజలు బాధ్యతగా ఫారములు నింపి ఓటును పోకుండా జాగ్రత్త పడాలి అన్నారు. సమావేశం కు రాని బి.ఎల్.వో పై షోకాజ్ నోటీసు ఇవ్వాలని తహశీల్దార్ ఆదేశం జారీ చేశారు.  ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఆంగోతు శ్రీనివాసరావు మాట్లాడుతూ 7 పోలింగ్ బూత్ లలో సర్ పక్రియలో చేసిన పనిలో బి,ఎల్.ఓ ల కృషి అభినందనీయం అన్నారు. ఇంచార్జీ కార్యదర్శి కొల్లు దుర్గారావు, వార్డు సభ్యులు పానుగంటి లక్ష్మణ్ గౌడ్, దారా రాము, రూపా రాంబాబు, వార్డు మెంబర్లు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.