24 June, 2026 | 3:08 PM

Breaking News

నకిరేకల్ నియోజకవర్గ కాంగ్రెస్‌కు నూతన మండల అధ్యక్షుల నియామకం   •   పాఠశాలకు వచ్చిన జాతీయ పక్షి.. నెమలిని చూసి మురిసిపోయిన చిన్నారులు   •   విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ పంపిణీ   •   పారిశుద్ధ్య పనులు ముమ్మరం   •   గిరిజన విద్యాభివృద్ధికి కృషి చేయాలి   •   జర్నలిస్ట్ పై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి తహశీల్దారుకు వినతి   •   యువతను ప్రమాదంలోకి నెట్టే మాదకద్రవ్యాల పట్ల అప్రమత్తంగా ఉండాలి   •   రైతులు నకిలీ విత్తనాల పట్ల అప్రమత్తంగా ఉండాలి   •   యువత, చిన్నారులు డ్రగ్స్ పట్ల దూరంగా ఉండాలి: సీఐ సంజీవ్   •   చీర్లవంచలో అరుణోదయ మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి భూమి పూజ   •  

మాసానీపల్లి,మెల్లకుంట తండాలో గ్రామసభలు

19-02-2026 05:10 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని మాసానిపల్లి,మెల్లకుంట తండాలో గ్రామసభలు గ్రామ సర్పంచులు పెద్దపట్లలో సునంద కిషన్ రెడ్డి,బాల్య నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించారు.సభలో ఉపాధి హామీ కూలీలకు సంబంధించిన విషయాలపై ఫీల్డ్ అసిస్టెంట్(క్షేత్ర సహాయకులు) సంగయ్య,  రాములు జాబ్ కార్డు ఉన్న ప్రతి పౌరుడు తప్పనిసరిగా ఉపాధి హామీ పనులకు హాజరుకావాలని,కూలీలకు రోజువారీ కనీస వేతనం రూ.307 ఉంటుందని చెప్పారు.మాసానిపల్లి గ్రామంలో ఊరి చివర మందొటమీద వరకు విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని,కోతుల,కుక్కల నివారణ చర్యలు చేపట్టాలని ప్రజలు గ్రామసభలో తెలిపారు.డ్రైనేజ్ శుభ్రత, తాగునీటి సమస్యలపై ప్రత్యేకంగా చర్చ జరిగింది.మెల్లకుంట తండాలో నీటి సమస్య తీవ్రంగా ఉందని గ్రామస్థులు వెల్లడించారు.

హెల్త్ డిపార్ట్మెంట్ మాట్లాడుతూ ప్రస్తుతం వైద్యసేవలు జానకంపల్లిలో అద్దె గదిలో నిర్వహిస్తున్నామని తెలిపారు.మెల్లకుంట గ్రామపంచాయతీ భవనం పూర్తయిన తర్వాత ఒక గది కేటాయించాలని కోరారు.బడ్జెట్ విషయానికి వస్తే,ప్రభుత్వం నుంచి ఇంకా ఎటువంటి నిధులు జమ కాలేదని అధికారులు స్పష్టం చేశారు.మెల్లెకుంట తండాలో గిరిజన సంఘ నాయకులు మోహన్ నాయక్ మాట్లాడుతూ...మెల్లకుంట గ్రామపంచాయతీ పరిధిలో 300లకుపైగా ఆహార భద్రత రేషన్ కార్డులు ఉన్నప్పటికీ,రేషన్ బియ్యం తెచ్చుకోవడానికి ప్రజలు దూరం వెళ్లాల్సి వస్తోందన్నారు.గ్రామానికి ప్రత్యేక రేషన్ డీలర్ షాప్ ఏర్పాటు చేయాలని కోరారు. అనంతరం గ్రామంలోని వివిధ శాఖ అధికారులు వారివారి సందేశాలను వివరించారు.ఈ కార్యక్రమంలో  సర్పంచ్ పెద్దపట్లలో సునంద కిషన్ రెడ్డి,రామావత్ బాల్యనాయక్,పంచాయతీ కార్యదర్శి ప్రవీత,సుభాష్ రెడ్డి,వార్డ్ మెంబర్లు,మాజీ సర్పంచ్ కొర్ర కేస్లీ-వాసురం,మాజీ ఎంపీటీసీ దేవిసింగ్,గ్రామ పెద్దలు పాల్గొన్నారు.