24 June, 2026 | 4:13 PM

విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ పంపిణీ

24-06-2026 03:05 PM

ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ఆసిఫాబాద్ స్కూల్ కాంప్లెక్స్ పరిధిలోని రవిచంద్ర కాలనీ గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాలలో బుధవారం నూతన విద్యా సంవత్సరాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్‌ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు విద్యార్థులకు విద్య ప్రాముఖ్యత, క్రమశిక్షణ, నిరంతర అభ్యాసం గురించి అవగాహన కల్పించారు.విద్యార్థులు ప్రతిరోజూ పాఠశాలకు హాజరవుతూ పాఠాలను శ్రద్ధగా అభ్యసించాలని, ప్రభుత్వం అందిస్తున్న విద్యా సదుపాయాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. చదువుతో పాటు మంచి నడవడి, క్రమశిక్షణ అలవర్చుకోవడం ద్వారా జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని తెలిపారు.పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ అందుకున్న విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.