5న అన్ని గ్రామాల్లో గ్రామసభలు
03-06-2026 01:49 PM
ఎంపీఓ జలంధర్
జన్నారం, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని అన్ని గ్రామాల్లో ఈ నెల 5న తప్పనిసరిగా గ్రామసభలను ఏర్పాటు చేయాలని మండల పంచాయతీ అధికారి (MPO) జలంధర్ ఆదేశించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 5న మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించాలని ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక ర్యాలీలు, మొక్కలు నాటడం వంటి వివిధ రకాల కార్యక్రమాలను నిర్వహించాలని కోరారు. ఇందుకు సంబంధించి మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.






