3 June, 2026 | 2:26 PM

ప్లాస్టిక్ వినియోగం పర్యావరణానికి ముప్పు

03-06-2026 01:46 PM

డి ఎఫ్ ఓ బాలమణి 

ఆసిఫాబాద్(విజయక్రాంతి): జిల్లా సిర్పూర్ (టి) మండలంలోని దుబ్బగూడ గ్రామంలో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే నష్టాలు, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా అటవీ అధికారి  సి.హెచ్. బాలమణి  మాట్లాడుతూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం పర్యావరణానికి, వన్యప్రాణులకు, మానవ ఆరోగ్యానికి హానికరమని ఆమె తెలిపారు.

ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి వస్త్ర సంచులు, పర్యావరణ హిత ప్రత్యామ్నాయాలను వినియోగించాలని సూచించారు.అటవీ శాఖ అధికారులు అప్పయ్య, శ్రీనివాస్, ప్రవీణ్ కుమార్, మోహన్ మాట్లాడుతూ గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుతూ ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో అటవీ శాఖ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. గ్రామస్థులు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు.