30 July, 2026 | 1:09 AM

గ్రీన్ గ్రోవ్ ఇనిస్టిస్టూషన్‌లో ఘనంగా గురు పూజోత్సవం

30-07-2026 12:00 AM

చౌటుప్పల్, జూలై 29 : భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే గురు పూజోత్సవాన్ని చౌటుప్పల్లోని గ్రీన్ గ్రోవ్ ఇన్స్టిట్యూషన్స్లో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ గురువులకు పుష్ప గుచ్ఛాలు అందించి, పాదాభివందనం చేసి ఆశీస్సులు పొం దారు.కార్యక్రమంలో విద్యార్థులు గురువుల గొప్పతనం, గు రు-శిష్య సంబంధం, భారతీయ సంస్కృతిలో గురువు స్థానం గురించి ప్రసంగాలు చేసి, పాటలు ఆలపించి, సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్నారు.

ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ బండి వీణ అనిల్ రెడ్డి మాట్లాడుతూ, తల్లిదండ్రుల తర్వాత జీవితానికి సరైన దిశను చూపించే వారు గురువులేనని అన్నారు. గురువులను గౌరవించడం ప్రతి విద్యార్థి బాధ్యత అని, విద్యతో పాటు మంచి విలువలు, క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాసాన్ని నేర్పించే గురువుల సేవలు అమూల్యమైనవని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్ సాదుపల్లి లక్ష్మి, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొని గురువులకు శుభాకాంక్షలు తెలియజేసి, గురు పూజోత్సవాన్ని ఉత్సాహంగా నిర్వహించారు.