30 July, 2026 | 12:47 AM

ఇరాన్‌తో యుద్ధంలో నైతిక ఓటమిని ట్రంప్ అంగీకరించాలి

30-07-2026 12:00 AM

 సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం

ఖమ్మం, జులై 29(విజయక్రాంతి): ఇరాన్ తో యుద్ధంలో అమెరికా నైతికంగా ఓడిపోయిందని, ఆ ఓటమిని ట్రంప్ అంగీకరించి వెంటనే ఒప్పందాలు చేసుకోవాలని సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రo అన్నారు. స్థానిక సుందరయ్య భవ నంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎర్ర శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో ముఖ్యఅతిథిగా పా ల్గొని తమ్మినేని వీరభద్రం ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇ రాన్ పెట్టిన అన్ని నిబంధనలను అమెరికా అంగీకరిస్తుందని ట్రంప్ చెబుతూ పైకి మా త్రం యుద్ధంలో తమదే పై చేయి అంటున్నారని ఆయన అన్నారు. మేకపోతు గంభీరం లా ట్రంప్ వ్యవహారం ఉందని ఆయన అ న్నారు. అందుకే యుద్ధంలో నైతికంగా అమెరికా ఓటమిని అంగీకరించాలని ఆయన అన్నారు. ఇంకా యుద్ధాన్ని కొనసాగిస్తే అమెరికా ఆర్థిక పరిస్థితి చిన్న భిన్నమయ్యే అవకాశా ఉందని,ఆర్థిక నిపుణులు చెప్తున్నారు.

యుద్ధం కారణంగా మిగిలిన దేశాలు కూడా ఇబ్బంది పడుతున్నాయని ఆయన అ న్నారు. అందుకే ట్రంప్ ఓటమి అంగీకరించి చర్చలకు వచ్చి యుద్ధాన్ని ముగించాలని ఆ యన అన్నారు.ఈ సందర్భంగా పోతినేని సు దర్శన్ మాట్లాడుతూ నీట్ పేపర్ లీకేజ్ సం దర్భంగా దేశంలో ముఖ్యంగా ఢిల్లీలో యు వత, విద్యార్థులు కలిసి చేసిన పోరాటం విజయవంతమైందని ఆయన అన్నారు.

విద్యా ర్థుల యువత పోరాటానికి కేంద్ర ప్రభుత్వం తలవంచక తప్పలేదని అన్నారు. ఈ పోరా టం ఈ విజయం చారిత్రాత్మకమైనదని ఆ యన అన్నారు.ఈ పోరాట స్ఫూర్తితో బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ మతోన్మాద శక్తులు వ్యతిరేకంగా పోరాటం చేయాలని అన్నారు. ఈ జిల్లా కమిటీ సమావేశంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాచర్ల భారతి, బండి రమేష్ , కళ్యాణం వెంకటేశ్వరరావు, వై విక్రమ్ భూక్య వీరభద్రం, మాదినేని రమేష్, బొంతు రాంబాబు,తదితరులు పాల్గొన్నారు.