లక్ష్మి నరసింహ స్వామీ దేవాలయం పుష్పయాగం, పవళింపు సేవ
04-05-2026 05:56 PM
మఠంపల్లి,(విజయక్రాంతి): మఠంపల్లి మండలంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం మట్టపల్లి మహాక్షేత్రములో శ్రీ స్వామి వారి కళ్యాణమహోత్సవములు సందర్భముగా సోమవారం ఉదయం యాజ్ఞిక సహాయకులు హరికిరణాచార్యులు, దేవాలయ అర్చకులు తూమాటి రామాచార్యులు, శ్రీనివాసాచార్యులు, బ్రహ్మాచార్యులు, ఫణిభూషణమంగాచార్యులు, పద్మనాభాచార్యులు, బదరీనారాయణాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి వారిచే పుష్పయాగము కార్యక్రమము నిర్వహించబడినది. ఈ పుష్పయాగ కార్యక్రమానికి దాతలు దాట్ల కృష్ణంరాజు, పి.బి.వి.ఆర్ గోపాలరాజు ఎన్.సి.ఎల్.అదేవిధంగా సాయంత్రం శ్రీ స్వామి వారికి ద్వాదశ సేవలు,శృంగార డోలోత్సవము,పవళింపు సేవ కార్యక్రమములు వేదమంత్రములతో అత్యంత వైభవముగా నిర్వహించబడింది.






