14 March, 2026 | 5:10 PM

ఘనంగా ఛత్‌వ్రత్ పూజలు

08-11-2024 12:51 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 7 (విజయక్రాంతి):  నగరంలో ఛత్‌వ్రత్ పూజలను సికింద్రాబాద్ ఆర్కే పురం కమిటీ అధ్యక్షుడు దినేష్‌కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉత్తర భారత ప్రజలు జరుపుకొనే ఈ పూజలను గురువారం ట్యాంక్‌బండ్, సికింద్రాబాద్ లాల్‌బజార్‌లోని నాగ్‌మందిర్‌లో బీహార్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సూర్యోదయం, సూర్యాస్తమయం అర్థం వచ్చే ఈ పండుగను బీహార్, ఉత్తరప్రదేశ్‌లో జరుపుతారు.