1 May, 2026 | 2:06 AM

సారథికి ఘనంగా వీడ్కోలు

01-05-2026 12:00 AM
  1. పదవీ విరమణ చేసిన డీజీపీ శివధర్‌రెడ్డి
  2. శాంతి భద్రతల డీజీపీ మహేష్ భగవత్‌కు బాధ్యతల అప్పగింత

రంగారెడ్డి, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): డీజీపీ బి శివధర్‌రెడ్డి గురువారం పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయం (డీజీపీ ఆఫీ స్) వేదికగా పోలీసు అధికారులు, సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు. కార్యక్రమ ఆరంభంలో శివధర్‌రెడ్డి తన బాధ్యతలను మహేష్ ఎం భగవత్‌కు అప్పగించారు. డీజీపీగా సీవీ ఆనంద్ బాధ్యతలు స్వీకరించే వరకు మహేష్ భగవత్ ఇన్‌చార్జి డీజీపీగా వ్యవహరించనున్నారు.

అధికారిక బదిలీ ప్రక్రియ అనంతరం, శివధర్‌రెడ్డి కార్యాలయంలోని అధికారులను, సిబ్బందిని కలు సుకున్నారు. అందరికీ కరచాలనం చేస్తూ, ఆత్మీయంగా పలకరిస్తూ సాగారు. పూలతో అలంకరించిన ప్రత్యేక వాహనంపై నిలబడి అందరికీ అభివాదం చేశారు. ఐపీఎస్ అధికారులు తాళ్లతో ఆ వాహనాన్ని లాగుతుం డగా, సిబ్బంది ఆయనపై పూలవర్షం కురిపించారు.

కార్యక్రమంలో టీజీసీఎస్బీ డైరెక్టర్ శిఖా గోయల్, జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా, శాంతి భద్రతల డీజీపీ మహేష్ ఎం భగవత్, టీఎస్‌ఎల్పీఆర్బీ చైర్మన్ వి.వి. శ్రీనివాసరావు, ఎస్పీఎఫ్ డీజీ స్వాతి లక్రా, ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ విజయకుమార్ లతో పాటు పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు.