కళాకారులకు ఎల్లప్పుడూ అండగా ఉంటాం
- అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త
- బంజారాహిల్స్‌లో అంతర్జాతీయ నృత్య దినోత్సవ వేడుకలు
- మెగా టాలెంట్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లక్ష్యంగా ప్రత్యేక కార్యక్రమాలు
నాగోల్, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఎల్వీ ప్ర సాద్ ఆడిటోరియంలో కీర్తి ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ డాన్స్ డే సెలబ్రేషన్ 2026 కార్యక్రమం ఘనంగా నిర్వహిం చారు. అంతర్జాతీయ నృత్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ వేడుకలో కళాకారులు తమ ప్రతిభను అద్భు తంగా ప్రదర్శించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ‘హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ,‘ ‘టీపీసీసీ ప్రధా న కార్యదర్శి, అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త‘ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ, కళలకు సమాజంలో ఎంతో ప్రాధా న్యం ఉందని, యువత తమ ప్రతిభను చాటుకోవడానికి ఇలాంటి వేదికలు ఎంతో అవసరమని పేర్కొన్నారు. కళాకారులకు అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
మెగా టాలెంట్ బుక్ ఆఫ్ రికార్డ్ స్థానం సంపాదించాలనే లక్ష్యంతో ప్రత్యేక ప్రదర్శనలు నిర్వహించడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కీర్తి ఆర్ట్స్ అకాడమీ చేపడుతున్న సేవలను అతిథులు అభినందిస్తూ, భవిష్యత్తులో మరింత మంది కళాకారులు వెలుగులోకి రావాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో సినీ దర్శకుడు బాబ్జీ, ప్రముఖ న్యూమరాలజిస్ట్ దైవజ్ఞ శర్మ, అంతర్జాతీయ వ్యాపారవేత్త మరియు సామాజిక కార్యకర్త బొంతల రాధిక తదితరులు పాల్గొన్నారు. కూచిపూడి నృత్య గురు వులు, కళాకారులు పెద్ద సంఖ్యలో హాజరై తమ ప్రతిభను ప్రదర్శించారు. కీర్తి ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షురాలు, గిన్నీస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ బిందు లిమ్మా కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషిం చారు. పెద్ద ఎత్తున కళాభిమానులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.






