స్టేట్ 2వ ర్యాంక్ సాధించిన విద్యార్థినికి ఘన సత్కారం
కష్టపడితేనే విజయాలు సాధ్యం: మాజీ MLA మెచ్చా నాగేశ్వరరావు
దమ్మపేట,(విజయక్రాంతి): ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో అశ్వారావుపేట VKDVS ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం(BiPC) చదువుతున్న దమ్మపేట(మండలం), నాయుడుపేట గ్రామానికి చెందిన మల్లిశెట్టి రాంబాబు కుమార్తె మల్లిశెట్టి ధనతేజస్విని ఇంటర్ బై పి సి ఫలితాల్లో 440 మార్కులకు గాను 438 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంక్ సాధించింది. ఈ సందర్భంగా అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ MLA, BRS పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు ఆమెను అభినందించి శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మెచ్చా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన విద్యార్థులు కూడా పట్టుదలతో చదివితే రాష్ట్ర స్థాయిలో అగ్రస్థానం సంపాదించగలరని ధనతేజస్విని నిరూపించిందిని, ఆమె సాధించిన విజయానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా కారణమని, భవిష్యత్తులో ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామస్తులు పాల్గొని విద్యార్థినికి శుభాకాంక్షలు తెలిపారు.






