17 August, 2026 | 12:46 AM

సండ్రకు ఘన సత్కారం

17-08-2026 12:11 AM

కల్లూరు,ఆగస్టు 16 (విజయ క్రాంతి): బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు,సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య జన్మదినం సందర్భంగా కల్లూరు మండల బీఆర్‌ఎస్ నాయకులు ఆయనను ఘనంగా సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఆదివారం ఖమ్మంలోని సండ్ర నివాసానికి వెళ్లిన నా యకులు ఆయనను మర్యాదపూర్వకంగా క లిసి శాలువాలతో సత్కరించి, పుష్పగుచ్ఛా లు, స్వీట్లు అందజేశారు. ఈ సందర్భంగా బీ ఆర్‌ఎస్ నాయకులు మాట్లాడుతూ.. సండ్ర వెంకట వీరయ్య తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం ఖమ్మం చేరుకున్న నేపథ్యంలో ఆదివారం ఆయనను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపినట్లు పేర్కొన్నారు.