శంకరపల్లిలో ‘కమిషనర్ రాజ్యాంగం’!
- 111 జీవోకు తూట్లు.. బరితెగించిన అక్రమార్కులు
- ప్రజాప్రతినిధులకే బెదిరింపులు
- ముడుపుల మత్తులో మున్సిపల్ యంత్రాంగం
రంగారెడ్డి/శంకరపల్లి, అగస్టు 16(విజయక్రాంతి) : శంకరపల్లి మున్సిపాలిటీ పరిధిలో అక్రమ నిర్మాణాల దందా సరిహద్దులు దా టుతోంది. నిబంధనలను కాపాడాల్సిన ము న్సిపల్ కమిషనరే స్వయంగా ఒక ‘నియంత’లా వ్యవహరిస్తూ, అక్రమార్కులకు కొ మ్ము కాస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 111 జీవో పరిధిలోని రక్షిత ప్రాం తాలను సైతం లెక్కచేయకుండా భారీ కట్టడా లు వెలుస్తున్నా, మున్సిపల్ అధికారులు కనీసం కన్నుత్తి చూడకపోవడం వెనుక భా రీగా ‘ముడుపుల’ చేతులు మారాయనే వా ర్తలు వినిపిస్తున్నాయి.
111 జీవోకు నీళ్లు.. రోడ్డుపైనే భారీ షెడ్లు....
మున్సిపల్ పరిధిలోని బుల్కాపూర్ ప్రాం తం జీవో 111 రక్షిత మండలం కిందకు వస్తుంది. ఇక్కడ ఎలాంటి ప్రాజెక్టులు లేదా భారీ శాశ్వత నిర్మాణాలకు అనుమతి లేదు. కానీ, శంకరపల్లి హైదరాబాద్ ప్రధాన రహదారి పక్కనే నిబంధనలకు విరుద్ధంగా భారీ షెడ్లను నిర్మించి, కమర్షియల్ అవసరాలకు అద్దెకు తిప్పుకుంటున్నారు.
ప్రతినిత్యం మం డల, జిల్లా స్థాయి ఉన్నతాధికారులు తిరిగే ఈ రోడ్డుపైనే ఇన్ని అక్రమాలు జరుగుతున్నాపట్టించుకోకపోవడం వెనుక మున్సిపల్ యంత్రాంగం అనుమానాస్పద మౌనం దా గి ఉందనే విమర్శలు వస్తున్నాయి. కొండకల్ వెళ్లే మార్గంలోనూ వ్యవసాయ క్షేత్రాల పేరిట అక్రమ కట్టడాలు వెలుస్తున్నా యం త్రాంగం ఉలకదు.. పలకదు.
నేను చెప్పిందే వేదం.....
పట్టణంలో విచ్చలవిడిగా సెల్లార్లు, ఆక్రమణలతో భవనాలు నిర్మిస్తున్నారని ఫిర్యా దు చేయడానికి వెళ్లిన ప్రజాప్రతినిధులకు కమిషనర్ నుండి చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి.
మీరు ఊరికి సర్పంచ్....కౌన్సిలర్ కావొచ్చు.. మున్సిపాలిటీలో నేను చెప్పిందే నడవాలి....
అంటూ ఒక ప్రజాప్రతినిధితో కమిషనర్ దురుసుగా మాట్లాడ టం ఆయన నైజానికి అద్దం పడుతోంది. కౌ న్సిలర్లు, సర్పంచ్లు స్థా నిక అక్రమాలపై ఎన్ని ఫిర్యాదులు చేసినా బుట్టదాఖలు చేస్తూ, కింది స్థాయి సిబ్బం దికి ‘ఎవరి మాట వినొద్దు, నా హుకుం మా త్రమే చెల్లాలి‘ అని ఆర్డర్లు వేస్తున్నట్లు మున్సిపల్ అంతా కొడై కూస్తుంది.
తెరవెనుక వసూళ్ల దందా..‘సాహెబ్’ను కలవాల్సిందే!
పట్టణంలో ఎక్కడ చిన్న ఇటుక పడినా, మున్సిపల్ సిబ్బంది వాలిపోతున్నారు. ‘పెద్ద సార్ను కలవండి‘ అంటూ నిర్మాణదారులకు ఫోన్లు చేసి బెదిరింపులకు దిగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కింది స్థాయి సిబ్బం దిని ఏజెంట్లుగా మార్చుకుని భారీ ఎత్తున మామూళ్లు వసూలు చేస్తున్నారనే విమర్శ లు వెల్లువెత్తుతున్నాయి. లంచాలు ఇచ్చిన అక్రమార్కులకు రెడ్ కార్పెట్ వేస్తూ, ప్రశ్నించిన సామాన్యులపై,ప్రజాప్రతినిధులపై ని యంతలా ప్రవర్తిస్తున్నారని స్థానికులు ఆగ్ర హం వ్యక్తం చేస్తున్నారు.
పన్నులకు గండి.....
అనుమతులు లేకుండా నిర్మిస్తున్న ఈ భారీ షెడ్ల వల్ల మున్సిపాలిటీకి రావలసిన లక్షలాది రూపాయల ఆదాయానికి గండిపడుతోంది. నిబంధనల ప్రకారం నడుచుకునే సామాన్య ప్రజలను పన్నుల పేరిట పీడించే అధికారులు, బడా అక్రమార్కుల వద్ద మాత్రం లొంగిపోవడంపై ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. మున్సిపల్ పరిధి లో అక్రమ నిర్మాణాల గురించి వివరణ కోరెందుకు కమిషనర్ కు ఫోన్ చేస్తే... తాను వర్క్ లో బిజీగా ఉన్నాను అంటూ... ఫోను పెట్టేసాడు.
జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలి
శంకరపల్లి మున్సిపాలిటీలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలు, జీవో 111 ఉల్లంఘనలు మరియు కమిషనర్ నియంతృత్వ వైఖరిపై జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు తక్షణమే విచారణ జరిపించాలి. అక్రమ షెడ్లను కూల్చివేసి, బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు, ప్రజాప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు.






