17 August, 2026 | 12:40 AM

మున్సిపాలిటీలో హెల్త్ అసిస్టెంట్ ఎక్కడ?

17-08-2026 12:01 AM
  1. విధులు నిర్వహించేది ఎవరు?
  2. డిప్యూటెషన్‌కే ప్రాధాన్యం
  3. రెగ్యులర్ పోస్టు నియామకం ఎప్పుడు? 
  4. మధిర మున్సిపాలిటీకి ఇద్దరు హెల్త్ అసిస్టెంట్లు అవసరమా?
  5. సమయపాలన పాటించని డిప్యూటేషన్ హెల్త్ ఆఫీసర్

మధిర, ఆగస్టు16(విజయ క్రాంతి): మధిర పంచాయితీ గ్రేడ్ 2 మున్సిపాలిటీ  ఏర్పడిన తర్వాత మున్సిపాలిటీలో వివిధ శాఖలలో అధికారుల  నియమితులయ్యా రు. తర్వాత కాలంలో బదిలీల స్థానాలు ప్ర కారం మున్సిపాలిటీకి హెల్త్ అసిస్టెంట్ గా ఉన్న అధికారి డిప్యూటేషన్ ద్వారా మధిర మున్సిపాలిటీ హెల్త్ అసిస్టెంట్ నియమితులయ్యారు. గత ఏడు సంవత్సరాల నుండి అధికారి మున్సిపాలిటీలోనే నిధులు నిర్వహిస్తున్నారు. కానీ మున్సిపాలిటీలోని 22 వా ర్డులో జనన మరణ నివేదిక రికార్డులో న మోదు చేసేందుకు వెళ్లకుండా వార్డ్ ఆఫీసర్ల ను పంపించడం జరిగింది.

ఆ శాఖకు ఎంత న్యాయం చేశారు అనే ప్రశ్న మున్సిపాలిటీ ప్రజలను ప్రశ్నార్థకంగా మిగిలింది...? గతం లో పనిచేసిన కమిషనర్లు, మున్సిపాలిటీలో ప్రస్తుత అధికారి అండదండలతో 8 సంవత్సరాలుగా డిప్యూటేషన్ పై విధులు నిర్వహి స్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే పాల్వంచ పంచాయతీగా ఏర్పడినప్పటికీ డిప్యూటెషన్ పై వచ్చి గత 8 సంవత్సరాలుగా ఎటు వెళ్లకుండా మధిరలోనే తిస్ట వేసుకొని విధులు నిర్వహిస్తున్నప్పటికీ అధికారులు మాత్రం ఎ టువంటి చర్యలు తీసుకోకపోవడం గమనా ర్దం. ప్రస్తుతం తెలంగాణలో పాల్వంచ కార్పొరేషన్ గా ఏర్పడినది అక్కడ హెల్త్ అసిస్టెంట్ సేవలు చేసేందుకు సిబ్బంది అవసరం ఉన్నప్పటికీ ఉన్నతాధికారులు ఇటువంటి వారిపై దృష్టి సాధించకపోవడం గమనార్థం. 

మధిర మున్సిపాలిటీకి రెగ్యులర్ హెల్త్ అసిస్టెంట్ వచ్చినప్పటికీ డిప్యూటేషన్ హెల్త్ అసిస్టెంట్ కూడా విధులు నిర్వహిస్తున్నారు. డిప్యూటేషన్ హెల్త్ అసిస్టెంట్ మధిర మున్సిపాల్టీ వదిలి వెళ్ళకుండా ఇక్కడే నామ మాత్రపు విధులు నిర్వహించడం వెనుక ఏ అధికారి అండ దండలు ఉన్నాయి. ఇంకా ఆశ్చర్యపోయే సంఘటన ఏమిటంటే కార్యాలయంకు విధులు నిర్వహించేందుకు ఇష్టా నుసారంగా ఖమ్మం నుంచి రావడం పోవ డం జరుగుతుంది. డిప్యూటేషన్ పై విధులు నిర్వహిస్తున్న హెల్త్ అసిస్టెంట్, మేనేజర్‌కు సమాన విలువ మున్సిపాలిటీలో ఉండటం. 

కాలక్షేపం చేయడానికే డ్యూటీకి రావడం, సంతకం పెట్టడం,భోజనం చేయడం, వెళ్ళటం లాంటి విధులు నిర్వహించేందుకు ప్రభుత్వ, ప్రజల ధనాన్ని వృధా చేయడం మధిర మున్సిపాలిటీలో నెలకొంది. ఇప్పటికైనా మధిర మున్సిపల్ కమిషనర్  ప్రత్యేక చొరవ తీసుకొని మునిసిపాలిటీలో ఏఏ శాఖలో అధికారులు ఎంత మేరకు విధులు నిర్వహిస్తున్నారు. ప్రత్యేక దృష్టి పెట్టాలని మధిర ప్రజలు కోరుకుంటున్నారు.

మున్సిపల్ కమిషనర్ కొంపల్లి శామ్యూల్ బి.ఐ. పాల్ ను వివరాల కోరగా.... మధిర మున్సిపాలిటీకి నూతనంగా బాధ్యతలు చేపట్టారని, ఉద్యోగుల కొరత ఉన్నదని, విచారణ చేపడతామని అన్నారు.