ప్రతిభ చాటిన విద్యార్థులకు ఘన సన్మానం
18-07-2026 12:00 AM
మేడిపల్లి, జూలై 17 (విజయక్రాంతి) : మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్, బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని మేడిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రతిభ చాటిన విద్యార్థులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల ప్రథమ ర్యాంకర్ ఎం. చందన ప్రతిష్ఠాత్మక ట్రిపుల్ ఐటీ బాసరలో సీటు సాధించగా, ఆయేషా సిద్దిఖ్ ద్వితీయ ర్యాంకర్గా నిలిచారు.
పదవీ విరమణ పొంది న ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు శుక్రవారం తన సొంత ఖర్చులతో విద్యార్థినులను ఘనంగా సన్మానించి,నగదు బహు మతులు, పుస్తకాలను అందజేశారు. విద్యార్థులను ప్రోత్సహించిన శ్రీనివాసరావు చొర వను హెచ్‌ఎం. సత్యప్రసాద్, పాఠశాల ఉపాధ్యాయ బృందం అభినందించారు.






