ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఐక్యతను, సామరస్యాన్ని పెంపొందిస్తాయి
ఘనంగా శ్రీ వీరాంజనేయ స్వామి మహా విగ్రహ శంకుస్థాపన
ముఖ్యఅతిథిగా డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్
మేడిపల్లి, జూన్ 25 (విజయక్రాంతి): ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను, సామరస్యాన్ని పెంపొందిస్తాయని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ అన్నారు.
గురువారం బోడుప్పల్ సర్కిల్ మేడిపల్లి డివిజన్ పరిధిలోని శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయంలో శ్రీ ఆంజనేయ స్వామి మహా విగ్రహ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి, ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా తోటకూర వజ్రెష్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వేద పండితులు మంత్రోచ్ఛారణల మధ్య మహా విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపన, పునఃప్రతిష్ఠ, భూమిపూజ కార్యక్రమాలను నిర్వహించారు.
అనంతరం వజ్రెష్ యాదవ్ మాట్లాడుతూ, ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యత, సామరస్యాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ రామ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి, మాజీ మేయర్ అమర్ సింగ్, మాజీ డిప్యూటీ మేయర్ శివ కుమార్ గౌడ్, విగ్రహ దాత దర్గా సుధాకర్ రెడ్డి,మాజీ కార్పొరేటర్లు సింగిరెడ్డి పద్మా రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






