26 June, 2026 | 1:28 AM

వర్షాలు కురవాలని గ్రామ దేవతలకు జలాభిషేకం

26-06-2026 12:00 AM

జనగామ, జూన్ 25 (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర వర్షాభావ పరిస్థితి నెలకొనగ రై తులు నాటిన పత్తి విత్తనాలు, మొక్కజొన్న విత్తనాలు మొలకెత్తుకపోవడంతో పాటు భూమిలోనే ఉడికిపోతున్నాయి. దీంతో తరిగొప్పు మండలంలోని నర్సాపూర్ గ్రామస్తులు సమృద్ధిగా వర్షా లు పడాలనీ కోరుతూ గురువారం గ్రామదేవతలకు జలాభిషేకం నిర్వహించారు. అనంతరం పా యిరాల పాపమ్మ, వాన దేవుని ఉయ్యాల పాటలతో గ్రామ నడిబొట్టున బతుకమ్మ ఆడారు.

ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు కిరణ్ కుమార్ గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరై మహిళలతో కలిసి వర్ష దేవుని పాట పాడుతూ బతుకమ్మ ఆడారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తార కుమార్, ఉప సర్పంచ్ మహేష్, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పాల్గొన్నారు.