12 May, 2026 | 11:03 AM

Breaking News

కస్తూర్బాగాంధీ విద్యాలయంలో అదనపు గదుల నిర్మాణం కోసం భూమి పూజ   •   వడదెబ్బతో ఉపాధి కూలి మృతి   •   చంద్రు తండా వద్ద అగ్నికీలల్లో రెండు లారీలు.. భయానక రోడ్డు ప్రమాదం   •   తమిళ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్! అన్నాడీఎంకేలో చీలిక.. విజయ్‌ TVKకి మద్దతు   •   రైతుల కష్టానికి ప్రతిఫలం దక్కేలా ప్రభుత్వం పని చేస్తుంది   •   అర్ధరాత్రి అంతర్‌జిల్లా చెక్‌పోస్ట్‌ను తనిఖీ చేసిన డీసీపీ   •   వేధిస్తే షీ టీమ్స్‌ను ఆశ్రయించండి   •   ఆహార భద్రతలో నాణ్యత ప్రమాణాలు పాటించాలి   •   చెట్టుపై పండ్లను తినేందుకు వెళ్లి వలలో చిక్కుకొనిచనిపోతున్న పక్షులు   •   ఇల్లందులో రాజకీయ దుమారం..   •  

జీళ్ళచెరువులో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

12-05-2026 09:54 AM

కూసుమంచి, మే 12(విజయక్రాంతి):ఖమ్మం జిల్లా, కూసుమంచి మండలం జీళ్ళచెరువు గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా అర్చకులు చిలకమర్రి స్వామినాథ్ చార్యులు ఆధ్వర్యంలో మంగళవారం వేడుకలను భక్తులు ఘనంగా జరుపుకున్నారు. తెల్లవారుజామున స్వామివారికి అభిషేకాలు, ఆకు పూజ చేశారు. స్థానిక భక్త భజన మండలి ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా పారాయణము జరిగింది.

భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు. తీర్థప్రసాదాలు స్వకరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఐతగాని వెంకటరమణ నాగేశ్వరరావు, వార్డు సభ్యుడు పెండ్ర అంజయ్య, భక్తులు చెన్నా వెంకన్న, విజయ్, అంబాల సైదులు, మల్లెల రవికుమార్, బూర్లే రవికుమార్,  మాజీ దేవాలయ చైర్మన్లు బొడ్డు నరేందర్, బూర్లే వీరబాబు, చెన్నా వీరభద్రం, గోగుల అంజయ్య, చారి, భాస్కర్ చారి, మెట్టెల లింగయ్య, ఉడుగు ఉదయ్, ముద్రబోయిన వెంకటేశ్వర్లు, ముద్రబోయిన నాగేశ్వరరావు, కొండపల్లి రామయ్య తదితరులు పాల్గొన్నారు.