ఘనంగా ఇన్వెస్టిట్యూర్ సెర్మనీ
- కొత్తగా ఎన్నికైన విద్యార్థి మండలికి బాధ్యతల అప్పగింత
- బేగంపేట హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో నిర్వహణ
హైదరాబాద్, జూన్ 25(విజయక్రాంతి): బేగంపేట్‌లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్(హెచ్‌పీఎస్) తమ పాఠశాల భోజనశాలలో గురువారం 2026 విద్యా సంవత్సరం కో సం బాధ్యతల అప్పగింత కార్యక్రమాన్ని(ఇన్వెస్టిట్యూర్ సెర్మనీ) ఘనంగా నిర్వహించిం ది. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన విద్యార్థి మండలికి ఈ విద్యా సంవత్సరానికి నాయకత్వ బాధ్యతలను లాంఛనంగా అప్పగిం చింది. ఈ కార్యక్రమానికి రియర్ అడ్మిరల్ శ్రీనివాస్ మద్దుల, వీఎస్‌ఎం, అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్(విదేశీ సహకారం, ని ఘా) ముఖ్య అతిథిగా విచ్చేశారు. విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ నా యకత్వం, క్రమశిక్షణ, పట్టుదల, నిబద్ధత, గౌరవంతో దేశానికి సేవ చేయడం ప్రాముఖ్యతపై విలువైన పరిజ్ఞానం పంచుకున్నారు.
ఆయన స్ఫూర్తిదాయక ప్రసంగం యువ నా యకులకు ఆదర్శంగా నిలవాలని, సవాళ్లను ఆత్మవిశ్వాసంతో స్వీకరించాలి, శ్రేష్ఠత, కలిసి పనిచేయడం ద్వారా విలువలను నిలబెట్టాలని ప్రోత్సహించింది. ఈ వేడుకలో నూత నంగా నియమితులైన విద్యార్థి మండలి లాంఛనంగా ప్రమాణ స్వీకారం చేయడం ఒక ప్రధాన ఘట్టంగా నిలిచింది. ఈ విద్యార్థి నాయకులు పాఠశాల ఆదర్శాలను నిలబెడతామని, తమ విధులను చిత్తశుద్ధితో నిర్వరి స్తామని, తమ తోటివారికి ఆదర్శంగా నిలుస్తామని ప్రతిజ్ఞ చేశారు.
ఈ కార్యక్రమానికి హెచ్‌పీఎస్ యాజమాన్యం, అధ్యాపకులు, తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు, విద్యార్థులు హాజరయ్యారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ డాక్టర్ స్కంద్ బాలి మా ట్లాడుతూ ‘ఈ ప్రమాణ స్వీకారం కేవలం ఒక లాంఛనప్రాయమైన కార్యక్రమం మాత్ర మే కాదు, బాధ్యత, వ్యక్తిత్వం, సేవ అనే ప్ర యాణానికి నాంది. నిజాయితీ, సానుభూతి, దృఢత్వం, కార్యాచరణ ద్వారా నాయకత్వం పెంపొందుతుందని హెచ్‌పీఎస్ వద్ద మేము నమ్ముతాం. మా నూతనంగా ఎన్నికైన వి ద్యార్థి మండలి పట్ల మేము గర్వపడుతు న్నాం. వారు మా సంస్థ గొప్ప వారసత్వాన్ని, విలువలను ముందుకు తీసుకువెళ్తూనే తమ తోటివారికి స్ఫూర్తినిస్తారని మాకు పూర్తి నమ్మకం ఉంది’ అనిఅన్నారు.






