17 April, 2026 | 2:44 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

ఘనంగా విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం

06-06-2025 12:20 AM

ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి 

గద్వాల, జూన్ 5 ( విజయక్రాంతి ) :  గద్వాల మండలం పరిధిలోని లత్తిపురం గ్రామంలో ని బండల శ్రీ సోమేశ్వర స్వామి మరియు శ్రీ చౌడేశ్వరి దేవి  విగ్రహ ప్రతిష్ట మహోత్సవము  కార్యక్రమానికి గురువారం ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని దేవాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే  మాట్లాడుతు...

ప్రతి గ్రా మంలో బడి, గుడి తప్పనిసరిగా ఉండాలని దేవాలయాలు ఉండడం వల్ల ప్రజలలో భక్తి శ్రద్ధల తో పాటు దేవుని పూజించడం వల్ల శాంతి నెలకొల్ప బడుతుందన్నారు. గ్రామంలో అందరూ క లిసి మెలిసి ఉండాలని దేవాలయ అభివృద్ధి కోసం ఏ విధంగా పాటుపడుతున్నారో. అదేవిధం గా  గ్రామ అభివృద్ధికి కూడా ప్రతి ఒక్కరూ కలిసి మెలిసి ఐక్యతతో ముందుకు సాగాలన్నారు. 

ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, మాజీ జడ్పీ వైస్ చైర్పర్సన్ సరోజమ్మ రమేష్ నాయుడు, మాజీ జెడ్పిటిసి రాజశేఖర్, నాయకులు సత్య రెడ్డి, రాధాకృష్ణారెడ్డి, చంద్రశేఖర్, రాజా రెడ్డి , నాయకులు కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.