4 August, 2026 | 2:05 AM

హరిహర కళాభవన్‌లో సువర్ణ కంకణ పురస్కారాల మహోత్సవం

04-08-2026 12:00 AM

మెట్ పల్లి, ఆగస్టు3(విజయక్రాంతి):సికింద్రాబాద్ ఎస్.పి. రోడ్డులోని ప్రముఖ హరిహర కళాభవన్ లో లలిత కళా సమాఖ్య సేవా, సామాజిక, సాంస్కృతిక సంస్థ రుద్రాక్ష వైభవం ఆధ్యాత్మిక పీఠం ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవ సువర్ణ కంకణ అవార్డుల సంబరాలు ఘనంగా నిర్వహించబడ్డాయి.ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా మెట్పల్లి మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రిపాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

అనంతరం వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన ప్రముఖులకు, ప్రతిభాపాటవాలు కనబరిచిన కళాకారులకు చైర్మన్ మైలారపు లింబాద్రి సువర్ణ కంకణం, జ్ఞాపిక, గోల్ మెడల్ శాలువాలతో అత్యంత ఘనంగా సన్మానం చేశారు.ఈ సందర్భంగా మెట్ పల్లి మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి మాట్లాడుతూ సమాజంలో విశిష్ట సేవలు అందిస్తున్న వారిని గుర్తించి, ఇటువంటి ప్రతిష్టాత్మక పురస్కారాల తో సత్కరించడం అభినందనీయమని కొనియాడారు. సాంస్కృతిక, సామాజిక రంగాల వికాసానికి లలిత కళా సమాఖ్య చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు.ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు, వివిధ రంగాల ప్రముఖులు, కళాకారులు మరియు ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.