7 July, 2026 | 6:24 PM

Breaking News

"సర్" ప్రక్రియను ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలి   •   బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నాయకత్వానికి ఏడాది.. రామాలయంలో ప్రత్యేక పూజలు   •   ఆదివాసి నాయకపోడ్ కులస్తులకు దాతలకు హృదయపూర్వక ధన్యవాదాలు   •   ప్రభుత్వ ఉచిత విద్యను, సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలు చేరాలి   •   విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన పెద్దకాపర్తి సర్పంచ్   •   గౌలిగూడ కు వెళ్లాలా... అయితే ముక్కు మూయాల్సిందే...!   •   మృతుల కుటుంబాలకు పరామర్శ, ఆర్థిక సాయం   •   డబుల్ మర్డర్ కేసులో సంచలన తీర్పు   •   విడతల వారీగా యూరియా ఇవ్వడం సరికాదు   •   మున్సిపాలిటీలో పారిశుద్ధ్య పనులు   •  

ఘనంగా ఉగాది వేడుక

20-03-2026 12:00 AM

ఆలేరు, మార్చి 19 : పరాభవ నామ నూతన తెలుగు సంవత్సరము ఉగాది సందర్భంగా ఆలేరు పట్టణంలో  మాతమ్మ గుడి దగ్గర  పూజారి సుక్క కృష్ణ ఆధ్వర్యంలో ఉగాది వేడుకను గురువారం ఘన.గా జరుపుకన్నారు.

ఈ సందర్భముగా ఆలేరు మున్సిపల్ చైర్మన్ బీజని బాలమణి భాస్కర్,  కౌన్సిలర్ పస్తం ఆంజనేయులు లను కుల పెద్దమనషులు ఘనంగా సన్మానం చేశారు, తదుపరి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేసి స్వామివారికి ఉగాది పచ్చడిని నైవేద్యంగా సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎండి సలీం, విజయ్‌కుమార్, దూడల రాజు,  కుల సభ్యులు పాల్గొన్నారు.

తెలుగు సంవత్సరంలో అందరి జీవితంలో ఆనందం వెల్లివిరియాలి

సూర్యాపేట, మార్చి 19 (విజయక్రాంతి):  తెలుగు సంవత్సరాది ఉగాది నుండి అందరి జీవితాలలో ఆనందం వెల్లి విరియాలను మున్సిపల్ చైర్ పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాధి అన్నారు. గురువారం జిల్లా కేంద్రం లో ఉగాది పండుగ సందర్భంగా నూతన కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణ ప్రజలకు శ్రీ పరాభవ నామ సంవత్సరం అందరి కుటుంబాల్లో ఆనందం, ఆరో గ్యం, ఐశ్వర్యం  విజయాలను నింపాలని, ప్రకృతి ఆశీస్సులతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.

ఈ సంవత్సరం సమృద్ధిగా పంటలు పండాలని రైతులు ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు.ఏడాదిలో కొత్త ఆశలు, కొత్త ఆశయాలతో అందరూ కలిసిమెలిసి, సంతోషంగా పండుగను జరుపు కోవాలన్నారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్, మున్సిపల్ అధికారి ప్రసాద్, కౌన్సిలర్ గుణగంటి హేమా సతీష్, రాచకొండ శ్రీనివాస్, జూలకంటి నాగరాజు, కక్కిరేణి శేఖర్, వల్లల శేఖర్, ప్రవీణ్, రవి, శోభన్, శివ, కోటేశ్వరరావు, వెంకటేశ్వర్లు, ఆర్యవైశ్య నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా ఉగాది వేడుకలు

నూతనకల్, మార్చి 19: మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో ఉగాది పర్వదినాన్ని గురువారం నాడు అత్యంత వైభవంగా నిర్వహించారు. వసంత రుతువు ఆగమనంతో కొత్త ఆశలతో తెలుగు ప్రజలు నూతన సంవత్సరానికి ఘ నంగా స్వాగతం పలికారు. గ్రామాల్లోని ప్రజ లు ఉదయం నుండే తమ ఇండ్ల ముందు రంగురంగుల ముగ్గులు వేసి, మామిడి తోరణాలతో అలంకరించుకున్నారు.

సాంప్రదా యబద్ధంగా ఉగాది పచ్చడిని సేవించి, భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఆలయా లన్నీ భక్తులతో కిటకిటలాడాయి.మండల కేంద్రంలోని మిర్యాల గ్రామంలో పురోహితులు నూతన తెలుగు సంవత్సరానికి సం బంధించిన పంచాంగాన్ని ప్రజలకు వివరించారు. ఈ ఏడాది వర్షాలు, పంటలు, రాశి ఫలాల గురించి భక్తులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని పురోహితుల ఆశీర్వచనాలు తీసుకున్నారు.