7 July, 2026 | 6:59 PM

"సర్" ప్రక్రియను ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలి

07-07-2026 06:24 PM

హుజూర్నగర్ ఆర్డిఓ శ్రీనివాసులు

నేరేడుచర్ల,(విజయక్రాంతి): "సర్" ప్రక్రియను ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని హుజుర్నగర్ ఆర్డీవో శ్రీనివాసులు అధికారులకు సూచించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయడం లక్ష్యంగా మున్సిపల్ చైర్మన్ కొనతం వెంకటరెడ్డి, అధ్యక్షతన హుజూర్ నగర్ ఆర్డీఓ శ్రీనివాసులు, తహశీల్దార్, మున్సిపల్ కమిషనర్, బిఎల్వోలు వార్డు అధికారులు, మెప్మా సిబ్బందితో మున్సిపాలిటీ కార్యాలయం నందు సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా హుజూర్ నగర్ ఆర్డిఓ శ్రీనివాసులు మాట్లాడుతూ... ప్రతి అర్హులైన ఓటరికి అవసరమైన సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని, ఓటరు జాబితాలో పేర్ల నమోదు, మార్పులు, తొలగింపులు వంటి ప్రక్రియలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కోరారు. బూత్ స్థాయిలో క్షేత్రస్థాయిలో సమగ్ర పరిశీలన నిర్వహించి, ప్రతి దరఖాస్తును నిబంధనల మేరకు పరిశీలించాలని బిఎల్వో లకు సూచించారు.