20 March, 2026 | 5:16 AM

ఖేడ్‌లో ఘనంగా ఉగాది వేడుకలు

20-03-2026 12:13 AM

నారాయణాఖేడ్, మార్చి 19: నారాయణాఖేడ్ మున్సిపల్ పరిధిలోని ప్రసిద్ది చెందిన రామ్  మందిర్ లో మున్సిపల్ చైర్మ న్ నాగేష్ శెట్కార్ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని సీతారాముల వారికి పట్టు వస్త్రాలు సమర్పించి, ప్రత్యేక అభిషేక పూజ లు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ సభ్యులతో కలిసి భక్తిశ్రద్ధలతో దేవుడిని దర్శించుకొని, ప్రజలందరికీ శుభ సంపదలు, ఆరోగ్యం కలగాలని ప్రార్థించారు.

ఈ కార్యక్రమం మున్సిపల్ కౌన్సిలర్ వివేకానంద మహేందర్, బాణపురం రాజు, పాం డు, మనోహర్,ఖేడ్ నియోజికావర్గం సోషల్ మీడియా కోఆర్డినేటర్ నందు, సుభాష్, నారాయణ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, మంజూరు నాయక్ తదితరులు పాల్గొన్నారు.